అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం
● మీకోసంలో 141 వినతుల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ లాండ్ రికార్డులు, హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, సీ్త్ర, మహిళా, శిశు సంక్షేమ శా ఖ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, దేవ దాయశాఖ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ లకు సంబంధించి 141 అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈ వో ఎల్‌ఎన్ వి.శ్రీధర్ రాజ పాల్గొన్నారు.
ఆగడాలు అరికట్టాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆమదాలవలస నియోజకవర్గంలో కూటమి నాయకుల ఆగడాలు అరికట్టాలని ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు మీకోసంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కి వినతిపత్రం అందజేశారు. కూటమి నేతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమదాలవలస మండలం ముద్దాడపేట, సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వంటి అధికారిక అనుమతులు ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి, అలాగే ఆమదాలవలస మండలం తోటాడ, పొందూరు మండలం బొడ్డేపల్లి, సింగూరు, నెల్లిమెట్ట వంటి అనుమతులు లేని ఇసుక రీచ్‌ల నుంచి ప్రతిరోజూ వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. దీనివలన సాగునీటి వనరులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారని, అటువంటి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అలాగే పొందూరు మండలం గోకరతపల్లి గ్రామానికి చెందిన వీవోఏను రాజకీయ కక్షతో తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఆమెను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలోని పంతకోనేరు, నూకమ్మ చెరువుల్లో ఆక్రమణల వలన ఆయకట్టు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలం, చెరువులను కాపాడలని కోరారు. ఈ విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment