
సూరిబాబు కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న మంత్రి హరీష్‌రావు
పాలకవీడు: తాను చనిపోతూ మరో నలుగురికి అవయవ దానం చేసిన పాలకవీడు మండలంలోని బొత్తలపాలెం గ్రామానికి చెందిన నర్రెడ్ల సూరిబాబు(49) కుటుంబ సభ్యులను రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు గురువారం హైదరాబాద్‌లో సన్మానించారు. వివరాలు.. నర్రెడ్ల సూరిబాబు ఏడాది క్రితం ఇంట్లో కిందపడడంతో మెదడులో రక్తం గడ్డకట్టి ప్రాణాపాయస్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ వారు సూరిబాబు కుటుంబ సభ్యులను కలిసి అవయవ దానంపై వారికి అవగాహన కల్పించారు. దీంతో సూరిబాబు భార్య లక్ష్మి, కుమారులు నాగేశ్వరరావు, శ్రవణ్, సందీప్ అవయవ దానానికి అంగీకరించడంతో శస్త్రచికిత్స చేసి అతడి గుండె, లివర్, కళ్లు, కిడ్నీలను మరో నలుగురికి అమర్చారు. కాగా జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ వారు రాష్ట్ర వ్యాప్తంగా అవయవ దానం చేసిన కుటుంబాలకు గురువారం హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా సన్మానం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment