సూర్యాపేట : యువత క్షణం మత్తు కోసం జీవితాలు కోల్పోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. బుధవారం జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల – వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీటింగ్ హాల్ లో నషా ముక్త్ భారత్ అభియాన్ (మిషన్ పరివర్తన్) లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం, సమాజం అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మాదకద్రవ్యాలనుంచి దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు గుర్తిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, డీఎంహెచ్‌ఓ కోటాచలం, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జయలత, సూపరింటెండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment