వేములపల్లి(మాడ్గులపల్లి): వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అతడి భార్యతో పాటు మరో ఇద్దరిని గురువారం మాడ్గులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన నక్క వెంకన్న, సరిత భార్యాభర్తలు. వీరికి 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో సరిత భర్త వెంకన్నకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకన్న పలుమార్లు సరితను కాపురానికి రావాలని అడిగగా ఆమె రాకపోవడమే కాకుండా కుక్కడం గ్రామానికి చెందిన ఊరుబిండు మల్లయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్త వెంకన్నను ఇబ్బందులకు గురిచేశారు. సరిత మేనమామ మన్నెం శ్రీను సైతం ఆమెకు సహకరించడంతో మనస్తాపానికి గురైన వెంకన్న గత నెల 22న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సరిత, ఊరుబిండు మల్లయ్య, మన్నెం శ్రీను వేధింపుల కారణంగానే తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెంకన్న సూసైడ్ లెటర్ సైతం రాశాడు. మృతుడి తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వెంకన్న భార్య సరితతో పాటు మల్లయ్య, శ్రీనును అరెస్ట్ చేసి మిర్యాలగూడ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు వారికి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment