యాదగిరిగుట్ట క్షేత్రంలో యూపీ సీఎం సురక్ష టీం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు చెందిన పోలీసు బృందం గురువారం సందర్శించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో శిక్షణ తీసుకుంటున్న యూపీ సురక్ష టీంకు చెందిన 51 మంది పోలీసు బృందం.. ఆలయాల్లో భద్రత, సీఎంతో పాటు ప్రముఖులు ఆలయాలను సందర్శించిన సమయాల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలపై శిక్షణలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చి పరిశీలించారు. ప్రముఖులు వచ్చిన సమయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలకు ఎలా పంపించాలి, ఆలయ పరిసరాల్లో ప్రముఖులు పర్యటిస్తున్న సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, బందోబస్తు విషయంలో ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు వివరించినట్లు సీనియర్ ఆర్‌ఎస్‌ఐ శివలాల్ తెలిపారు. వీరి వెంట అధికారులు సాయికుమార్, గణేష్, శంకర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment