జిల్లాలో రెండు టీమ్స్
మహిళల రక్షణకు
షీ టీమ్ నిఘా
సూర్యాపేటటౌన్ : మహిళల రక్షణకు షీటీమ్స్ పని చేస్తున్నాయి.. రద్దీ ప్రాంతాల్లో నిరంతం వీటి నిఘా ఉంటుంది.. అమ్మాయిలను ఎవరైనా ఈవ్‌టీజింగ్ చేసినా.. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినా కేసులు నమోదు చేస్తామని షీ టీమ్ ఎస్‌ఐ నీలిమ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో షీటీమ్స్ పనితీరు, మహిళలకు సంబంధించి ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు తదితర అంశాలపై ఆమె సాక్షితో మాట్లాడారు.
జిల్లాలో మొత్తం 45 రద్దీ ప్రదేశాలను గుర్తించి సిబ్బందిని ఏర్పాటు చేశాం. వారు నిత్యం ఆ ప్రాంతంలో గస్తీ చేస్తుంటారు. అమ్మాయిల పట్ల ఎవరైనా అబ్బాయిలు అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తాం. వరుసగా మూడు సార్లు కౌన్సిలింగ్ ఇస్తాం. అయినా మారకపోతే వారిపై కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో సూర్యాపేట, కోదాడ డివిజన్ పరిధిలో రెండు టీమ్‌లు పని చేస్తున్నాయి.
మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీటీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. డయల్ 100కు కాల్ చేయవచ్చు. లేదా సెల్ నంబర్ 8712686056కు ఫోన్‌చేయవచ్చు. ముఖ్యంగా విద్యార్థినులు ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటివి చేయకుండా మాకు ఫిర్యాదు చేస్తే వారి భరతం పడతాం.
షీటీమ్‌కు జిల్లాలో 2024లో మొత్తం 79 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల్లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 176 అవగాహన సదస్సులు నిర్వహించాం. ఆకతాయిలపై 102 కేసులు బుక్ చేశాం. అందులో 21 కేసులు ఎఫ్‌ఐఆర్ చేశాం. 145మంది ఫ్యామిలీ మెంబర్లకు కౌన్సిలింగ్ ఇచ్చాం. 2025లో ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో 42 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మొత్తం 10 పిట్టీ కేసులు బుక్ చేయగా అందులో ఒకటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. 16 మంది కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాం.
జిల్లాలో కేసులు ఇలా..
ధైర్యంగా షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలి
షీ టీమ్ నంబర్ : 87126 86056
ఫ జిల్లా వ్యాప్తంగా 45 ప్రదేశాల్లో
నిరంతరం గస్తీ
ఫ ‘సాక్షి’ తో షీ టీమ్ ఎస్‌ఐ నీలిమ
జిల్లాలో రెండు టీమ్స్
Comments
Please login to add a commentAdd a comment