
హెచ్‌సీయూ భూముల వేలం విరమించుకోవాలి
సూర్యాపేట : హెచ్‌సీయూ భూముల వేలాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్, కో కన్వీనర్లు ఎల్.భద్రయ్య, రేపాక లింగయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ నాయకులు ఆర్.రామనర్సయ్య, పబ్బతి వెంకటేశ్వర్లు, పి.వీరన్న, కె.వేణు, సుభాని, వెంకటేశ్వర్లు, యాకయ్య, వెంకటయ్య, రవికుమార్, యోగానంద్, సింహాద్రి, వెంకన్న, సైదులు, శ్రీనివాస్, వెంకటరెడ్డి, రాంబాబు, రమాదేవి, అబ్దుల్ కరీం, వెంకట్‌యాదవ్, అశోక్‌రెడ్డి, నర్సింహారావు, హస్సేన్, రమణ తదితరులు పాల్గొన్నారు.