తిరుత్తణిలో నిరసన తెలుపుతున్న రైతులు
తిరుత్తణి: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్ల పథకానికి వ్యతిరేకంగా తిరుత్తణిలో రైతులు బుధవారం నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. గృహాలకు ఉచిత విద్యుత్‌తో పాటు వ్యవసాయంకు, నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత్ విద్యుత్‌కు మంగళం పాడే విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో స్మార్ట్ మీటర్లు పొందుపరచనున్నారు. దీంతో రైతులతో పాటు ప్రతిఒక్కరూ నష్టపోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పథకాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ మేరకు రైతులు పోరాటాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణిలో సీపీఎం శ్రేణులతో పాటు రైతులు పాల్గొని విద్యుత్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు. స్మార్ట్ మీటర్లు పొందు పరిచే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో రైతులు వినతిపత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment