30 ఏళ్లుగా రూ.30 లక్షలు బకాయి
సేలం : మదురైలో 30 ఏళ్లుగా రూ. 30 లక్షలు బకాయి ఉన్న నేపథ్యంలో గృహ నిర్మాణ బోర్డు కార్యాలయంలో వస్తువులను అధికారులు మంగళవారం జప్తు చేశారు. వివరాలు.. మదురైలో గృహ నిర్మాణ బోర్డు పథకం కోసం మురుగసామి అనే వ్యక్తి కుటుంబీకులు 92 సెంట్ల భూమిని ఇచ్చారు. ఇందుకుగాను రూ. 11 లక్షలు మాత్రమే అందజేసి, మిగిలిన రూ. 30 లక్షలు బకాయి పెట్టారు. అయితే ఆ మొత్తాన్ని 30 ఏళ్లుగా ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయంగా అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బకాయి మొత్తాన్ని చెల్లించకపోవడంతో గృహ నిర్మాణ బోర్డు వస్తువులను జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మదురై ఎస్ఎస్ కాలనీలో తమిళనాడు గృహ నిర్మాణ బోర్డు కార్యాలయంలో ఉన్న టెబుళ్లు, కుర్చీల వంటి రూ. 30 లక్షల విలువ చేసే వస్తువులను జప్తు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment