2 ఏళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి | - | Sakshi
Sakshi News home page

2 ఏళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి

Published Thu, Jan 30 2025 2:14 AM | Last Updated on Thu, Jan 30 2025 2:14 AM

2 ఏళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి

2 ఏళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి

● కొత్త ప్రాజెక్టులకు జీ స్క్వేర్‌ నిర్ణయం

సాక్షి, చైన్నె: రానున్న 2 సంవత్సరాలలో రూ. 1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించామని జీ స్క్వేర్‌ నిర్ణయించింది. విల్లాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ లక్ష్యంగా కొత్త ప్రాజెక్టులను బుధవారం ప్రకటించింది. జీ స్క్వేర్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జునైత్‌ బాబు, నేషనల్‌ సేల్స్‌ హెడ్‌ శివకుమార్‌ పెతాయన్‌లు రియల్‌ ఎస్టేట్‌ వర్టికల్స్‌లో తాము చేపట్టనున్న కొత్త వ్యూహాత్మక వెంచర్‌ ప్రాజెక్టులను స్థానికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటూ ఆపరేటింగ్‌ జోన్‌లలో విభిన్న నివాస ప్రాధాన్యతలను అందించడమే లక్ష్యంగా నిర్ణయించామని ప్రకటించారు. రాబోయే 2 సంవత్సరాలలో ఈ వ్యూహాత్మక విస్తరణ కోసం 1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని అంచనా వేస్తున్నట్లు వివరించారు. జీస్క్వేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాల రామజయం మాట్లాడుతూ, కస్టమర్‌ల విభిన్న నివాస ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ సేవలను విస్తరించేందుక నిర్ణయించామన్నారు. అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు లేదా ప్లాట్‌లను ఇష్టపడినా, ప్రతి వ్యక్తికి వారి కలల ఇంటిని వారికి కావలసిన విధంగా, ఆకర్షణలతో తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. టైర్‌–1,2,3 నగరాలలోని అన్ని ఆపరేటింగ్‌జోన్‌లలో విస్తరించే విధంగా ప్రజలు తమ కలల గృహాలను ఎటువంటి పరిమితులు లేకుండా నిర్మించుకునేందుకు తగ్గినట్టుగా ముందుకెళ్లనున్నామని వివరించారు. ప్రాజెక్ట్‌లలో స్థిరమైన నాణ్యతకు కట్టుబడి ఉన్నామన్నారు. చైన్నె, కోయంబత్తూర్‌, తిరుచ్చి, హైదరాబాద్‌, మైసూరు తదితర నగరాల్లో బలమైన ఉనికితో జీ స్క్వేర్‌ పట్టణాభివృద్ధికి నిర్మాణాలతో తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement