తొలి వార్షికోత్సవానికి సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

తొలి వార్షికోత్సవానికి సన్నద్ధం

Published Thu, Jan 30 2025 2:14 AM | Last Updated on Thu, Jan 30 2025 2:13 AM

తొలి వార్షికోత్సవానికి సన్నద్ధం

తొలి వార్షికోత్సవానికి సన్నద్ధం

● సేవలకు విజయ్‌ పిలుపు

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం తొలి వార్షికోత్సవం జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2న రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు ఆ పార్టీ నేత విజయ్‌ పిలుపు నిచ్చారు. తమిళగ వెట్రి కళగం పార్టీని 2024 ఫిబ్రవరి 2న విజయ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యం అంటూ లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించారు. ఈ ఎన్నికల అనంతరం పార్టీ జెండాను విజయ్‌ ఆవిష్కరించారు. పార్టీ పరంగా కార్యక్రమాలను ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ ద్వారా వేగవంతం చేయించారు. గత ఏడాది చివర్లో విల్లుపురం జిల్లా విక్రవాండి వేదికగా బ్రహ్మాండ మహానాడును విజయవంతంగా జరుపుకున్నారు. తన సిద్ధాంతాలు ఏమిటో స్పష్టం చేశారు. ఆ తదుపరి ఓ వైపు సినీ కార్యక్రమాలు, మరో వైపు రాజకీయ కార్యక్రమాలు అంటూ పార్టీకార్యాలయంలో సమావేశాలతో ముందుకు సాగిన విజయ్‌ గతవారం జనంలోకి వచ్చారు. పరందూరు వేదికగా ప్రజాప్రచార ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రెండు రోజుల క్రితం 19 జిల్లాలకు పార్టీ కార్యవర్గాలతో తొలి జాబితాను ప్రకటించారు. మలి జాబితా బుద, గురవారాలలో వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితు పార్టీ తొలి వార్షికోత్సవాన్ని ప్రజలతో మమేకం అయ్యే విధంగా జరుపుకునేందుకు విజయ్‌ సిద్ధమయ్యారు.

సేవలతో..

ఫిబ్రవరి 2వ తేదీన పార్టీ ఏర్పాటు చేసి ఏడాది కానుంది. తొలి వార్షికోత్సవాన్ని రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ అన్నదానం, రక్తదానం, విద్య, వైద్య పరమైన సేవా కార్యక్రమల ద్వారా జరుపుకునేందకు సిద్ధమయ్యారు. విజయ్‌ ఆదేశాలతో భుస్సీ ఆనంద్‌ జిల్లాలోని నిర్వాహకులకు ఏర్పాట్లు, సేవా కార్యక్రమాల గురించి ఆదేశించారు. అదే రోజున చైన్నె పనయూరులో బ్రహ్మాండ కార్యక్రమానికి నిర్ణయించారు. పంచమూర్తుల సూత్రాలే తము ఆదర్శం అని ఇప్పటికే విజయ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కర్మయోగి కామరాజర్‌,ద్రవిడ సిద్దాంతకర్త పెరియార్‌, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌, వీర నారీమణులు, వేలునాచ్చియార్‌, అంజలై అమ్మాల్‌ నిలువెత్తు విగ్రహాలను పార్టీ కార్యాలయం ఆవరణలో ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకున్నారు. బుధవారం మరో 19 జిల్లాలకు కార్యవర్గ సభ్యులను విజయ్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement