పార్లమెంట్ సమావేశాలలో ఈసారి రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్
● డీఎంకే ఎంపీల ప్రణాళిక ● పార్లమెంట్ ఉభయ సభలలో ఒత్తిడికి నిర్ణయం ● స్టాలిన్ నేతృత్వంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల సమావేశం
ఎంపీల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య సాగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది అసెంబ్లీ వేదికక మరోమారు ఈ సమరం తెర మీదకు బహిర్గతమైంది. అదే సమయంలో తరచూ వేదికలెక్కి గవర్నర్ చేస్తూ వస్తున్న వ్యాఖ్యలను డీఎంకే కూటమి తీవ్రంగా పరిగణించి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది.
ఈ పరిస్థితులలో ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలో ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ పరిణామల నేపథ్యంలో ఉభయ సభలలో ఒక్క తమిళనాడు గవర్నర్‌నే కాకుండా, బీజేపీ యేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పరిస్థితులను పరిగణించి గవర్నర్లను టార్గెట్ చేస్తూ డీఎంకే సభ్యులు ఉభయ సభలలో సమరం భేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం చైన్నె తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో కలైంజర్ అరంగంలో డీఎంకే పార్లమెంటరీ, రాజ్యసభ సభ్యుల సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్, ప్రధాన కార్యదర్శి, సీనియర్‌నేత దురై మురుగన్, కోశాధికారి, ఎంపీ టీఆర్ బాలు , డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధిలతో పాటుగా ఎంపీలు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలకు స్టాలిన్ పలు సూచనలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి బకాయి పడ్డ నిధులు, రావాల్సిన నిధులపై ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రధానంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరును అస్త్రంగా చేసుకుని ఉభయ సభలలో తీవ్ర చర్చకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా ఈ సమావేశాలో తీర్మానాలు సైతం చేశారు.
గవర్నర్ తీరును
ఎండగట్టడమే ధ్యేయంగా..
ఈ సమావేశంలో ఆరు తీర్మానాలు చేశారు. ఇందులో మొదటిది గవర్నర్‌ను టార్గెట్ చేస్తూ చేశారు. గవర్నర్‌ల కోసం ‘ప్రవర్తన నియమాలు ‘ రూపొందించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఫైళ్లు , బిల్లులపై సంతకం చేయడానికి గవర్నర్‌కు గడువు విధించాలని, గవర్నర్ల రాజకీయం ఆ పదవికి ఉన్న గౌరవాన్ని సన్నగిళ్లే విధంగా చేశాయని, ఆ పదవిని రద్దు చేయాలని పట్టుబట్టనున్నారు. గవర్నర్ తమిళనాడు శాసనసభ సంప్రదాయాలను గౌరవించడం లేదని, సభ ఆమోదించిన బిల్లులను, తీర్మానాలను పక్కన పెడుతున్నారన్న ఆగ్రహాన్ని ఈ తీర్మానం ద్వారా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వారికిమార్గనిర్దేశం చేయాల్సిన గవర్నర్, సభలో ఓ ప్రతిపక్ష నాయకుడి లా రాజకీయాలు చేస్తున్నాడరని శివాలెత్తారు. వీసీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నారని, యూనివర్సిటీలను బీజేపీ, ఆయన రాజకీయ అంశాలకు వేదికగా చేసుకుని బోధనలు చేస్తున్నారని మండి పడ్డారు. గవర్నర్ ఏకై క ఎజెండా యుద్ధ రాజకీయాలు. అని, తన పరిధిని దాటి ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం, ప్రజాస్వామ్యాన్ని ఆయనకు బానిసగా మార్చినట్లుగా పరిస్థితులు నెలకొని ఉన్నాయని శివాలెత్తారు. రాజ్యాంగంపై విశ్వాసం కూడా లేని ఈ గవర్నర్ ప్రజా వ్యతిరేక రాజకీయాలు చేయడం తప్పా మరేమీ ఇక్కడం చేయడం లేదని , ‘ప్రభుత్వ విధాన నిర్ణయాల అమలుకు పూర్తిగా సహకరించి, మద్దతు ఇచ్చే రాజకీయేతర వ్యక్తిని గవర్నర్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. దేశంలో గవర్నర్ల పనితీరును ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎత్తి చూపుతూ చేసిన వ్యాఖ్యలను ఈ తీర్మానంలో గుర్తు చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు కూడా రాజకీయాలు చేయడం మానలేదని వివరించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రభుత్వాన్ని నిందించ లేదని, అయితే, ఈ గవర్నర్ విమర్శలు చేయడం తమిళనాడు ఔన్నత్యాన్ని కించ పరిచేవిధంగా ఉందని, దీనిని ఖండిస్తున్నామని ప్రకటించారు. గవర్నర్‌ను పదవి నుంచి తొలగించే వరకు పోరాటం తప్పదని, అలాగే గవర్నర్ ఎలా వ్యవహిరంచాలనే అంశంగా ప్రవర్తనా నియమావళి రూపకల్పన, పెండింగ్‌లో ఉన్న ముసాయిదాలు, తీర్మానాలకు ఆమోదంకు గడువు నిర్ణయం అమలే లక్ష్యంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు.
మరికొన్ని తీర్మానాలు..
టంగ్‌స్టన్ మైనింగ్‌వేలాన్ని రద్దు చేయించడంలో సీఎం స్టాలిన్ పాత్ర, ఆయనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. 5370 ఏళ్ల క్రితమే తమిళ భూమిలో ఇనుము యుగం మొదలైనట్టుగా పురావస్తు పరిశోధనలలో తేలిన నేపథ్యంలో ప్రపంచానికి ఈ సమాచారాన్ని చాటిచెప్పిన ద్రవిడ మోడల్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఉన్నత విద్యపై తమిళనాట తీవ్ర ప్రభావం చూపించే విధంగా యూజీసీ జారీ చేసిన ముసాయిదాలు, నిబంధనలు, ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఉభయ సభలో ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధం అని స్పష్టం చేశారు. అలాగే, ఢిల్లీలో నిరసనకు ఎంపీలు నిర్ణయించారు. మైనారిటీల సంక్షేమాన్ని ప్రభావితం చేసే వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ఆమోదించేందుకు కేంద్రంచేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తూ, దీనిని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. తమిళనాట అమలులో ఉన్న పథకాలు, ప్రాజెక్టులకు, విపత్తు నిర్వహణ కోసం నిధుల కేటాయింపు. కొత్త రైల్వే పథకాలకు , వివిధ నిధులు, బకాయిలను రాబట్టే దిశగా సభలో సమరానికి సిద్ధమవుతూ డీఎంకే ఎంపీల సమావేశం తీర్మానాలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment