చైన్నెలో అబలకు భద్రత కరువు | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో అబలకు భద్రత కరువు

Published Thu, Jan 30 2025 2:14 AM | Last Updated on Thu, Jan 30 2025 2:14 AM

చైన్నెలో అబలకు భద్రత కరువు

చైన్నెలో అబలకు భద్రత కరువు

● గవర్నర్‌ వ్యాఖ్య

సాక్షి, చైన్నె: చైన్నెలో చదువుకుంటున్న యువతులకు భద్రత కరువైందని రాష్ట్రగవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులే ఈ విషయాన్ని పేర్కొంటున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నా, పనిచేసే చోట్ల వారి స్థానం చాలా చిన్నదే అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయన్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపంలోని బ్రహ్మకుమారిల కేంద్రంలో బుధవారం జరిగిన మహిళా సదస్సులో గవర్నర్‌ ప్రసంగించారు. అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని పేర్కొంటూ, అయితే, వారికి పనిచేసే చోట స్థానం అన్నది చాలా చిన్నదిగానే ఉందని వ్యాఖ్యానించారు. అన్నింటా దూసుకెళ్తున్న మహిళలకు భద్రత అన్నది మరింతగా కల్పించాల్సిన అవశ్యం ఉందన్నారు. విద్యార్థినులు డిగ్రీలను పొందుతున్నారని, ర్యాంకులు సాధిస్తున్నారని గుర్తుచేస్తూ, స్నాతకోత్సవాలు ముగియగానే వారితో మాట్లాడితే కన్నీళ్లు రాక తప్పడం లేదన్నారు. పలువురు తమ ఉద్వేగాన్ని ఆపులేక కన్నీటి పర్యంతంతో ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తున్నారన్నారు. చైన్నెలో చదువుకోవడం అన్నది కష్టతరంగా మారిందని తల్లిదండ్రులే పేర్కొంటున్నారని వ్యాఖ్యలు చేశారు. చదువుకుంటున్న యువతులకు చైన్నెలో భద్రత కరువైందని పేర్కొంటూ, ఈ ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం ఈ నగరాన్ని సురక్షితంగా మార్చాల్సిన అవసరం నెలకొందన్నారు. సురక్షిత నగరాలలో చైన్నెకు జాతీయ స్థాయిలో గుర్తింపు అన్నది ఉంటే, ఇక్కడ అబలకు రక్షణ లేదని గవర్నర్‌ వ్యాఖ్యానించడాన్ని డీఎంకే కూటమి పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. గవర్నర్‌ తీరును టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఆ పదవికి అనర్హుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement