పరువు హత్యలో నిందితుడికి మరణ శిక్ష | - | Sakshi
Sakshi News home page

పరువు హత్యలో నిందితుడికి మరణ శిక్ష

Published Thu, Jan 30 2025 2:14 AM | Last Updated on Thu, Jan 30 2025 2:13 AM

పరువు

పరువు హత్యలో నిందితుడికి మరణ శిక్ష

సాక్షి, చైన్నె : దంపతుల పరువు హత్య కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ కోయంబత్తూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు బుధవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. వివరాలు.. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంకు చెందిన కనకరాజ్‌ , వర్షిణి ప్రియ 2019లో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. తన తమ్ముడు కనకరాజ్‌ చేసిన ఈ పనికి అన్న వినోద్‌ ఆగ్రహంతో ఊగి పోయాడు. దీంతో ఇంట్లో ఉన్న ఈ దంపతులను వినోద్‌ తన మిత్రులు ముగ్గురితో కలిసి వెళ్లి నరికి చంపేశాడు. ఈకేసులో వినోద్‌తో పాటుగా మిత్రులు కందవేల్‌, అయ్యప్పన్‌, ఇరుమాండిలను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు సంవత్సరాలుగా కేసు కోయంబత్తూరు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉంటూ వచ్చింది. గత వారం న్యాయమూర్తి విచారణను ముగించారు. బుధవారం తీర్పు వెలువరించారు. ఈకేసులో నిందితులుగా ఉన్న మిత్రులు ముగ్గురిని విడుదల చేశారు. వీరి ప్రమేయం అన్నది నిర్ధారణ కాక పోవడంతోనే విడుదల చేశారు. కనకరాజ్‌, వర్షిణిలను అతి దారుణంగా వినోద్‌ నరికి చంపినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. మరణించే వరకు అతడు జైల్లోనే ఉండే విధంగా ఆదేశించారు.

12 మంది విద్యార్థులకు అస్వస్థత

అన్నానగర్‌: కళ్లకురిచ్చి జిల్లా తిరుకోవిలూరు సమీపంలోని జి. అరియూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో పౌష్టికాహారం తిన్న 12 మంది విద్యార్థులు దానిని కొనుగోలు చేసి ఒక్కసారిగా వాంతులు చేసుకుని సృహతప్పి పడిపోయారు. దీంతో షాక్‌కు గురైన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వారిని రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ విద్యార్థులకు వైద్యం అందించిన అనంతరం విద్యార్థులు సాధారణ స్థితికి వచ్చారు. విద్యార్థినులు సృహతప్పి పడిపోవడంతో పాఠశాల ఆవరణలో గుమికూడిన ఘటన తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆహారం శాంపిల్‌ తీసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు. దీనిపై సమాచారం అందుకున్న తిరుకోవిలూరు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు, బాధిత విద్యార్థులతో విచారణ చేపట్టారు.

వానగరంలో

అపోలో క్యాన్సర్‌ సెంటర్‌

ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి

సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని వానగరంలో అపోలో నేతృత్వంలో ప్రపథమంగా ఎలెక్టా హార్మొనీ ప్రోతో కూడిన క్యాన్సర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి సుప్రియా సాహూ, అపోలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ ప్రీతారెడ్డి, ఎండి సునీతారెడ్డిలు హాజరయ్యారు. ఇక్కడి అత్యాధునిక వైద్య పరికరాలు సేవలను వీక్షించినానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తమిళనాడుకు అధునాతన క్యాన్సర్‌ కేర్‌ సేవలను తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. అపోలో క్యాన్సర్‌ కేంద్రాలు నిరంతరం కొత్త, వినూత్నమైన పరికరాలను , సేవలు ప్రవేశ పెడుతుండటం అభినందనీయమన్నారు. భారతదేశంలో క్యాన్సర్‌ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు సేవలు ముందుకెళ్తున్న వైద్య బృందాన్ని ప్రశంసించారు. అపోలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ ప్రీతారెడ్డి మాట్లాడుతూ తమ ఆస్పత్రి క్యాన్సర్‌ చికిత్సలకు మెరుగైన వైద్యం దిశగా చర్యలు విస్తృతం చేసిందన్నారు. చికిత్స, ఆవిష్కరణ, రోగికి మద్దతుగా కొత్త బెంచ్‌ మార్కులను సెట్‌శామన్నారు. ఇక్కడ తమిళనాడులోనే మొట్టమొదటి ఎలెక్టా అమర్చామని, హార్మొనీ ప్రో రేడియేషన్‌ థెరపీ టెక్నాలజీ తో చికిత్స అందించడం జరుగుతుందన్నారు. అధునాతన ఆంకాలజీ సేవలను ఇంటి వద్దకే చేర్చే విధంగా ప్రయాణం చేపట్టామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పరువు హత్యలో  నిందితుడికి మరణ శిక్ష 
1
1/1

పరువు హత్యలో నిందితుడికి మరణ శిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement