అలల్లో చిక్కుకుని ఇద్దరు జాలర్లు మృతి | - | Sakshi
Sakshi News home page

అలల్లో చిక్కుకుని ఇద్దరు జాలర్లు మృతి

Published Thu, Jan 30 2025 2:11 AM | Last Updated on Thu, Jan 30 2025 2:11 AM

-

అన్నానగర్‌: చైన్నె మెరీనా బీచ్‌లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు భారీ అలల్లో చిక్కుకుని మృతిచెందారు. చైన్నెలోని నడుకుప్పుం తిరువల్లికేణికి చెందిన భాస్కర్‌ (61), రాజీ (35). మత్స్యకారులైన వీరిద్దరూ బుధవారం ఉదయం మెరీనా బీచ్‌లో ఒకే బోటులో చేపల వేటకు వెళ్లారు. ఉదయం 7 గంటలకు, పడవ, వల ఇద్దరూ వివేకానంద ఇంటికి ఎదురుగా ఉన్న బీచ్‌లో కొట్టుకుపోయి ఒడ్డుకు వచ్చాయి. దీంతో ఒడ్డున నిలబడిన మత్స్యకారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే మరికొన్ని పడవలను తీసుకుని సముద్రంలోకి వెళ్లి భాస్కర్‌, రాజీ ఇద్దరి కోసం వెతికారు. అప్పుడు మత్స్యకారులిద్దరూ సముద్రంలో శవాలుగా తేలుతున్నట్లు గుర్తించారు. మృతదేహాలను పడవలో ఒడ్డుకు చేర్చారు. మెరీనా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మత్స్యకారులు చేపలు పట్టేందుకు లోతట్టు ప్రాంతానికి వెళ్లగా పెద్ద కెరటంలో చిక్కుకుని పడవ బోల్తా పడి ఇద్దరూ మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లిన వారు భారీ అలల్లో చిక్కుకున్న ఘటన తోటి మత్స్యకారుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement