మన మెరీనా.. మన ఘనత | - | Sakshi
Sakshi News home page

మన మెరీనా.. మన ఘనత

Published Mon, Aug 26 2024 12:18 PM | Last Updated on Mon, Aug 26 2024 12:18 PM

-

సాక్షి, చైన్నె : దేశంలో అతిపెద్ద బీచ్‌గా చైన్నె మెరీనా పేరుగాంచిన విషయం తెలిసిందే. ఈ తీరాన్ని సుందరీకరించే పనులు ప్రస్తుతం విస్తృతంగా జరుగుతున్నాయి. నిత్యం ఇక్కడకు తరలి వచ్చే పర్యాటకలకు, సందర్శకులకు మెరుగైన సేవలు, వసతుల కల్పనలో మెట్రో పాలిటన్‌ చైన్నె కార్పొరేషన్‌ ప్రత్యేక చొరవ చూపిస్తోంది. ఇందులో భాగంగా మన మెరీనా.. మన ఘనత నినాదంతో అవగాహన ప్రచారానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మెరీనా, బీసెంట్‌ నగర్‌ బీచ్‌ లలో భద్రత, నిఘా పర్యవేక్షణ కోసం అత్యాధునిక బీచ్‌ మోటారు వాహనాలను అందజేశారు. మురుగు కాలువలు, భూగర్భ డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు కొనుగోలు చేసిన రోబోటిక్‌ యంత్రాలను పంపిణీ చేశారు.

అలాగే బీచ్‌ను శుభ్రపరిచేందుకు పునరుద్ధరించిన యంత్రాల పంపిణీతో పాటు కార్పొరేషన్‌లో కారుణ్య నియామకాల కింద 411 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. అలాగే 10 మంది బాల అంబాసిడర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. బీచ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలన్న నినాదం, అవశ్యకతను వివరిస్తూ ఈ సందర్భంగా ముందుకు సాగారు. నిత్యం బీచ్‌ వైపుగా తరలి వచ్చే వారికి, దుకాణదారుల రూపంలో ఇసుక ప్రాంతంలో చెత్తాచెదారం చేరకుండా ప్రజలలో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. బీచ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని, వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సందర్శకులపై కూడా ఉందని సూచించారు.

బీచ్‌ అభివృద్ధికి చైన్నె కార్పొరేషన్‌ చర్యలు సరికొత్త అవగాహన కార్యక్రమానికి శ్రీకారం

కోస్టల్‌ మోటార్‌ వెహికల్స్‌ పంపిణీ డ్రైనేజీల శుభ్రతకు రోబోటిక్‌ యంత్రాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement