అన్నానగర్: కోయంబత్తూర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో రూ.20 లక్షల విలువైన బంగారు కడ్డీలు చోరీకి గురయ్యాయి. కోయంబత్తూరు జిల్లా జి.ఎన్.మిల్స్ చేరన్‌న్‌కు చెందిన సచిన్ కుమార్ (52) వ్యాపారి. 16వ తేదీన సచిన్ కుమార్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి పూణె వెళ్లాడు. అనంతరం కోయంబత్తూరుకు తిరిగి వచ్చాడు. ఆదివారం ఇంట్లో ఉన్న లాకర్ తెరిచి చూడగా రూ.20 లక్షల విలువైన 398 గ్రాముల బంగారు కడ్డీలు రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే గౌతంబాలయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ మద్యం విక్రయం
–ముగ్గురి అరెస్ట్
తిరువొత్తియూరు: తంజావూరు జిల్లా కుంభకోణం, ఎగువ కావేరీ కేఎంఎస్ నగర్‌లో ఒక ముఠా పుదుచ్చేరి నుంచి నకిలీ మద్యం, స్పిరిట్ కొనుగోలు చేసి వాటిని విక్రయించినట్లు తంజావూరు ప్రొహిబిషన్ పోలీసులకు సమాచారం అందింది. శనివారం రాత్రి పోలీసులు మాతా కోవిల్ ప్రాంతంలో సందేహాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు ఉంటున్న ఇంట్లో సోదాలు చేశారు. అప్పుడు పుదుచ్చేరి స్పిరిట్, నకిలీ మద్యాన్ని పెద్దమొత్తంలో తరలిస్తూ కలర్ డై కలిపి తమిళనాడు ప్రభుత్వ టాస్మాక్‌లో విక్రయించే ఖాళీ మద్యం బాటిళ్లలో నింపి నకిలీ తమిళనాడు ప్రభుత్వ ముద్ర, టాస్మాక్ స్టిక్కర్ అంటించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించి సయ్యద్ ఇబ్రహీం (46), అన్బం సెల్వన్ (39), కులంచినాథన్ (40)లను శనివారం ప్రొహిబిషన్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి 125 లీటర్ల పుదుచ్చేరి మద్యం, 560 క్వార్టర్ బాటిళ్లు, సీలింగ్ మిషన్, నకిలీ ప్రభుత్వ స్టాంప్ స్టిక్కర్లు, టాస్మాక్ లేబుల్స్, విలాసవంతమైన కారును స్వాధీనం చేసుకున్నారు. కారైకల్‌కు చెందిన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
అడవిపందిని చంపిన కేసులో
ముగ్గురి అరెస్ట్
తిరువొత్తియూరు: నీలగిరి జిల్లా పందలూరు సమీపంలోని బీదర్‌గార్డ్ అటవీ సరిహద్దులోని ఓ ప్రైవేట్ టీ ప్లాంటేషన్‌న్‌లో రోడ్డు పక్కన 2 ఏళ్ల మగపులి, 9 ఏళ్ల ఆడపులి చనిపోయి కనిపించాయి. కూడలూరు అటవీశాఖ అధికారి విచారణ చేయగా అక్కడ అడవి పంది మృతిచెందినట్లు గుర్తించారు. అడవిపందికి శవపరీక్ష నిర్వహించగా కొయ్య పెండలం బియ్యంతో విషం కలిపి పెట్టి చంపినట్టు తెలిసింది. అనంతరం చనిపోయిన పులుల మృతదేహాలను శవ పరీక్ష చేయగా వాటి జీర్ణాశయంలో అడవిపంది మాంసం వున్నట్టు తెలిసింది. పులులు అడవిపంది మాంసం తినడం వల్లే వల్లే చనిపోయాయని పరీక్షల్లో తేలింది. దీనికి సంబంధించి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కార్మికులు చనిపోయిన అడవిపంది మృతదేహాన్ని ఫొటో తీసి వున్నారు. వీరిని విచారించగా అడవి పందికి విషమిచ్చి చంపినట్లు అంగీకరించారు. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సూర్యనాథ్ బరాక్ (35), అమన్‌కోయల్ (24), సుబిత్నన్వర్ (25)లను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment