క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Mon, Aug 26 2024 12:14 PM | Last Updated on Mon, Aug 26 2024 12:14 PM

-

స్నేహితురాలి మృతితో మనస్థాపం

– నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య

అన్నానగర్‌: తిరుచ్చి జిల్లా తిరువెరుంబూరు సమీపంలోని అసూరైకి చెందిన రాజేష్‌ కన్నా (32). ఇతని చెల్లెలు పవిత్ర (27). అదే ప్రాంతానికి చెందిన ఉదయకుమార్‌తో ఈమెకు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. విదేశంలో ఉదయకుమార్‌ వెల్డర్‌గా పని చేస్తున్నాడు. పవిత్ర ఇంటి దగ్గర నివసిస్తున్న ఈమె స్నేహితురాలు సంగీత నిప్పంటించుకుని ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పవిత్ర తీవ్ర మనస్తాపంతో ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన పవిత్రను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు దువక్కంక్కుడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వేరు కాపురానికి భర్త

అంగీకరించకపోవడంతో..

వివాహిత ఆత్మహత్య

అన్నానగర్‌: మైలాడుతురైలో శనివారం రాత్రి భర్త వేరు కాపురానికి అంగీకరించకపోవడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు తాను ఉరితాడుతో బిగించుకునే వీడియోను తల్లిదండ్రులకు పంపించింది. వివరాలు.. మైలాడుదురై సమీపంలోని పల్లవరాయన్‌ పేట్టై ఫాతిమా నగర్‌కు చెందిన ఇబ్రహీం భార్య ఫాతిమా (34). వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. హిందువు అయిన దీప మతం మార్చుకుని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. రెండేళ్ల తర్వాత ఆ దంపతులకు కవల మగపిల్లలు జన్మించారు. ఇబ్రహీం తండ్రి గులాం మైదీన్‌, తల్లి ఫాతిమా, సోదరుడు అబ్దుల్లా, అతని భార్య హాజీరా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా నివసించారు. అబ్దుల్లా, ఇబ్రహీం ప్రస్తుతం దుబాయ్‌లో పని చేస్తున్నారు. ఇబ్రహీం తాను సంపాదించిన డబ్బును తన అన్నకే ఇస్తూ వచ్చాడు. కుటుంబం అన్న ఆధీనంలో ఉండడంతో భార్య ఫాతిమా వేరు కాపురం వెళ్లాలని భర్తకు చెబుతూనే ఉంది. దీంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ సందర్భంలో అబ్దుల్లా శనివారం ఫాతిమాను ఫోన్‌లో మాట్లాడుతూ వేరు కాపురానికి అంగీకరించబోనని స్పష్టం చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫాతిమా రాత్రి తన గదిలోనే మెడకు ఉచ్చు బిగించి సెల్‌ఫోనన్‌లో వీడియో తీసింది. చనిపోయాక ఇద్దరు పిల్లలను చూసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పి పంపించి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వీడి యో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మైలాడుదురై పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం ఫాతిమా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమి త్తం మైలాడుతురై ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement