పర్యాటక, ఆధ్యాత్మిక వీక్షణ | - | Sakshi
Sakshi News home page

పర్యాటక, ఆధ్యాత్మిక వీక్షణ

Published Wed, Jan 29 2025 12:49 AM | Last Updated on Wed, Jan 29 2025 12:49 AM

పర్యాటక, ఆధ్యాత్మిక వీక్షణ

పర్యాటక, ఆధ్యాత్మిక వీక్షణ

● ప్రగతిపై అధ్యయనం ● రాష్ట్రంలో వారం రోజుల పర్యటన ● ీసీఎస్‌తో హోం మంత్రిత్వశాఖ బృందం భేటీ

సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌. మురుగానందంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డ్‌ ఆఫ్‌ ఇండియన్‌ హోమ్‌ అఫైర్స్‌ అధికారుల బృందం భేటీ అయ్యింది. సచివాలయంలో ఈ సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. తమిళనాడులో విస్తృతంగా ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక వాడలు, కన్యాకుమారిలో తిరువళ్లువర్‌ విగ్రహం, మహాబలిపురంను అత్యుత్తమ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడం, తమిళనాడు సంస్కృతిలో భాగంగా , ప్రాచీన చిహ్నాలకు భాండాగారంగా మారిన కీలడి పురావస్తు తవ్వకాల గురించి ఈ బృందం ఆరా తీసింది. అంతే కాకుండా ఆయా ప్రాంతాలను వీక్షించేందుకు నిర్ణయించింది. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారులు గోపిళ్ల కృష్ణ శ్రీవాత్సవ్‌, జి.కృష్ణకుమార్‌, పి.అనుజ, జి. సత్యానంది, జి. హరిశంకర్‌, పి.వి. అబ్దుల్‌ బసల్‌, గోకుల్‌ కృష్ణ తదితరులు కేంద్ర బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ఆర్థికంగా దేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం ఆవిర్భవిస్తుండడం గురించి మురుగానందం వారికి వివరించారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఉత్తమ రాష్ట్రం మారినట్టు పేర్కొన్నారు. పురావస్తు పరిశోధనల విస్తృతంలో తమిళ సంస్కృతి, ప్రాచీనతను వెలుగులోకి తీసుకొస్తున్నామని తెలియజేశారు. వివిధ రకాల చిహ్నాల గురించి వివరించారు. మహాబలిపురం, మధురై మీనాక్షి అమ్మన్‌ ఆలయాల సాంస్కృతిక, పర్యాటక వైభవాన్ని గుర్తు చేశారు. జల్లికట్టు సంబారలు, కీలడి మ్యూజియం, కన్యామారిలో తిరువళ్లువర్‌ విగ్రహం, తంజావూరు బృహదీఽశ్వరాలయం, గంగైకొండ చోళపురం మొదలైనవి అనేక పర్యాటక ప్రదేశాలు తమిళనాడు అంతటా ఉన్నాయని వివరించారు. వీటన్నింటినీ ఈ బృందం వారం రోజులు తమిళనాడులో సందర్శించనుంది. ఈ సమావేశంలో రెవెన్యూ , విపత్తు నిర్వహణ శాఖ అదనపు డైరెక్టర్‌, కార్యదర్శి అముద, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి సమయమూర్తి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement