సాక్షి, చైన్నె: తమిళనాడు విద్యా విధానంపై ప్రభావం చూపించే రీతిలో యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఉన్నత విద్యామంత్రి కోవి చెలియన్ ఈమెయిల్ నిరసనకు పిలుపు నిచ్చారు. ఇటీవల కాలంగా యూజీసీ తీసుకుంటున్న నిర్ణయాలు జారీ చేస్తున్న ఉత్తర్వులను వివరిస్తూ శుక్రవారం రాత్రి ప్రకటన చేశారు. తమిళనాడులో ఉన్నత విద్యా విధానాన్ని సమూలంగా నాశనం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ dra-f-t-r-ef u a-t-io nr@ uf-c.g-ov.i n ఈమెయిల్స్‌ను యూజీసీకి పంపించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment