శ్రీలంక దళాల దాష్టీకం
● 13 మంది జాలర్ల అరెస్టు ● తుపాకీ కాల్పులు ● ఇద్దరి గాయాలు
సేలం : శ్రీలంక సముద్రతీర బలగాలు 13 మంది కారైక్కాల్ జాలర్లను సోమవారం అరెస్టు చేశారు. పుదుచ్చేరి రాష్ట్రం కారైక్కాల్ జిల్లా నుంచి 360 పడవల్లో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ స్థితిలో శ్రీలంక నెడందీవు సమీపంలో జాలర్లు చేపలు పడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన శ్రీలంక సముద్ర తీర గస్తీ దళం హద్దులు దాటి చేపలు పడుతున్నారని ఆరోపిస్తూ పుదుకోటకు చెందిన ఓ పడవను, అందులో ఉన్న 13 మందిని జాలర్లను అరెస్టు చేశారు. ఆ సమయంలో శ్రీలంక బలగాలు జరిపిన తుపాకీ కాల్పుల్లో పడవలోని అద్దాలు పగిలి ఇద్దరు జాలర్లు గాయపడినట్లు తెలిసింది. అదేవిధంగా ఆ ఇద్దరు జాలర్లు యాల్పాణం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం వెల్లడైంది. కాగా శ్రీలంక బలగాల వరుస దాడులు, అరెస్టుల కారణంగా తమిళ జాలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని జాలర్లు డిమాండ్ చేస్తున్నారు.
సముద్రంలో పడవలు
Comments
Please login to add a commentAdd a comment