క్వారీ గుంతలో మునిగి తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి
అన్నానగర్: తిరుపూర్ సమీపంలో క్వారీగుంతలో మునిగి తల్లి, ఇద్దరు కుమార్తెలు మరణించారు. బట్టలు ఉతకడానికి వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. తిరుపూర్ జిల్లా 63 ఇటువై పంచాయతీ–వాసుకినగర్ ఎక్స్‌టెన్షన్ సమీపంలోని వెలంపాళయంకు చెందిన రాజా కార్మికుడు. ఇతని భార్య రేవతి (25). వీరికి ప్రకాశిని (9), ప్రగణ్య (7) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఈ పరిస్థితిలో సోమవారం సాయంత్రం రేవతి, ఆమె కుమార్తెలు, సోదరి దీప, ఆమె పిల్లలు రితన్య, రితిక అనే ఆరుగురు వాసుకి నగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని క్వారీ గుంతలో బట్టలు ఉతకడానికి వెళ్లారు. అప్పుడు ఇద్దరు పిల్లలు ప్రగణ్య, ప్రకాశిని అనుకోకుండా నీటిలో పడిపోయారు. ఇది గమనించిన రేవతి, దీప వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే వారికి ఈత రాకపోవడంతో వారు కూడా నీటిలో మునిగిపోతూ కాపాడండి... కాపాడండి అంటూ అరిచారు. వారి అరుపులు విని ఇరుగుపొరుగు వారు వచ్చి నీటిలో మునిగిపోతున్న రేవతి, దీపను రక్షించారు. అయితే రేవతి నీటిలో మునిగి మృతి చెందినట్లు తేలింది. దీప ప్రాణాలతో బయటపడింది. అగ్నిమాపక సిబ్బంది క్వారీలో పడిపోయిన ప్రగాశిని, ప్రగణ్య మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరు పిల్లలతో, తల్లి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.
తిరుత్తణి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.19 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు చెల్లించిన కానుకలు లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో హుండీలు తెరిచి కానుకల లెక్కింపు చేపట్టారు. ఆలయ వసంత మండపంలో నిర్వహించిన కానకల లెక్కింపులో ఆలయ సిబ్బంది వంద మంది పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కానుకల లెక్కింపులో నగదుగా కోటి 19 లక్షల 36 వేల 528 రూపాయలు, 233 గ్రాముల బంగారం, 5,128 గ్రాముల వెండి భక్తులు కానుకగా చెల్లించిట్లు ఆలయ అధికారులు తెలిపారు. 25 రోజుల వ్యవధిలో ఈ కానుకలు లభించినట్లు ప్రకటించారు
డాక్టర్ సెంథిల్‌కుమార్‌కు జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, చైన్నె : వినాయక మిషన్ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగం డీన్ డాక్టర్ సెంథిల్‌కుమార్‌కు అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ప్రాంతీయ సదస్సులో జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇంటర్నేషనల్ లయన్స్ అసోసియేషన్ సహకారంతో ఉత్తమ విద్యావేత్తలు, వివిధ రంగాలలో సాధకులు, సమాజ సేవకుల సత్కార వేడుక స్థానికంగా మంగళవారం స్థానికంగా జరిగింది. అసోసియేషన్ ప్రాంతీయ అధ్యక్షుడు కామరాజర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీఐటీ చాన్స్‌లర్ డాక్టర్ జీ విశ్వనాథన్ హాజరై అలైడ్ హెల్త్ సైన్స్ విభాగంలో అత్యుత్తమ సేవలను అందిస్తున్న డీన్ డాక్టర్ సెంథిల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. అలైడ్ హెల్త్ సైన్సెస్ రంగంలో ఆయన చేసిన అత్యుత్తమ విద్యా సేవలకు దక్కిన ఈ పురస్కారానికి సెంథిల్‌కుమార్‌ను వినాయక మిషన్ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ గణేషన్, ఉపాధ్యక్షులు అనురాధా గణేషన్‌లు అభినందించి సత్కరించారు.
గత ఏడాది 268 మంది అవయవ దానం
– మంత్రి సుబ్రమణియన్ వెల్లడి
కొరుక్కుపేట: తమిళనాడులో బ్రెయిన్ డెడ్ అయిన 268 మంది తమ అవయవాలను దానం చేసి సరికొత్త రికార్డు సృష్టించారని ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ తెలియజేశారు. మంత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన ఇలా అన్నారు. తమిళ దేశంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కోసం అవయవ దానం చేసే గొప్ప కార్యక్రమం 2024 సంవత్సరంలో కొత్త శిఖరానికి చేరుకుంది. గత ఏడాది కాలంలో మొత్తం 268 మంది బ్రెయిన్ డెడ్‌కు అవయవాలు దానం చేశారు. అవయవ దాతల త్యాగాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన శ్రీహిస్టారిక్ ఆర్డర్ ఆఫ్ హానర్ఙ్ ఈ గొప్ప విజయానికి కారణం అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment