పంజాబ్ నుంచి సురక్షితంగా తిరిగొచ్చిన కబడ్డీ క్రీడాకారి
సేలం: పంజాబ్‌లో కబడ్డీ పోటీల సమయంలో దాడికి గురైన తమిళనాడుకు చెందిన క్రీడాకారిణులు సురక్షితంగా చైన్నెకి తిరిగి వచ్చారు. వివరాలు.. ఉత్తరాది రాష్ట్రాలలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొనడం కోసం వెళ్తున్న సమయంలో భద్రత లేనట్లు క్రీడాకారిణిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం పదిట్టా ప్రాంతంలో జరిగిన వర్సిటీల మధ్య కబడ్డీ పోటీలలో పాల్గొనడం కోసం తమిళనాడు నుంచి అళగప్పా వర్సిటీ, పెరియార్ వర్సిటీ, అన్నై తెరెసా వర్సిటీ జట్లు పాల్గొన్నాయి. వీరిలో అన్నై తెరెసా వర్సిటీకి దర్బాంగ్ వర్సిటీ జట్లకు మధ్య గత 24వ తేదీ జరిగిన కబడ్డీ పోటీలో తమిళ క్రీడాకారిణిలు, శిక్షణకులపై దాడి జరిగిన ఘటన తెలిసిందే. దీంతో పోటీల నుంచి బాయ్‌కాడ్ చేసిన క్రీడాకారిణిలు, శిక్షకులు ఢిల్లీలో ఉన్న తమిళనాడు ఇల్లంలో బస చేశారు. వారు మంగళవారం ఉదయం రైలు ద్వారా చైన్నెకి సురక్షితంగా తిరిగి వచ్చారు. తమను సురక్షితంగా తీసుకురావడానికి ఏర్పాటు చేసిన తమిళనాడు ప్రభుత్వానికి క్రీడాకారిణిలు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment