
పంజగుట్ట (హైదరాబాద్): సీఎం కేసీఆర్ మనవడిని ప్రభుత్వ హాస్టల్‌లో జాయిన్ చేయించాలని అప్పుడే హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులకు వసతులు, నాణ్యమైన భోజ నం లభిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్ అన్నారు. ప్రభుత్వ, గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడాన్ని నిరసిస్తూ బుధవారం పార్టీ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా శోభన్, పార్టీ నాయకులు ప్రగతిభవన్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. ఆ నివేదికలో ఏముంది?