![Central Govt Praises to Telangana Health Department - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/20/TS-Vaccine-1.jpg.webp?itok=RdnetJVa)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తోందంటూ కితాబు ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ శాతం మంది వైద్య సిబ్బంది ముందుకు వచ్చి టీకా వేయించుకోవడంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుకు, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి, వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్లకు రిజ్వీ అభినందనలు తెలిపారు.
తెలంగాణలో ఈ నెల 16వ తేదీ నుంచి టీకాల పంపిణీ మొదలైంది. 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండో రోజు (18వ తేదీ) 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడోరోజు మంగళవారం (19వ తేదీ) 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,625 మందికి వ్యాక్సిన్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment