హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముందస్తుగానే సిద్ధపడమని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు. అభ్యర్థులకు తగినంత సమయం కల్పించి వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జాబితాను ముందుగానే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేయడం విశేషం.
సుదీర్ఘంగా కొనసాగిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఎట్టకేలకు పూర్తి చేసిన బీఆర్‌ఎస్ పార్టీ తొలి విడతలో మొతం 105 మంది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. ముందుగా ప్రచారం జరిగినట్లే అత్యధిక సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేటాయించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment