సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే 22 నెలలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. నూతనంగా నియమించబడిన పోలీసు కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాలు జారీచేసే కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
‘టీఎస్‌పీఎస్సీని ప్రక్షాలన చేశాం. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. బీఆర్‌ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. పదేళ్లు అధికారంలో ఉంటూ.. ప్రజలు ఆమోదిస్తే మరో 10 ఏళ్లుగా అధికారంలో ఉంటాం. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు. కానీ.. నల్గొండలో సభకు మాత్రం కేసీఆర్ వెళ్లారు.
.. అసెంబ్లీ రానివారికి అధికారం ఎందుకు? ఇంటికే నియామక పత్రాలు పంపొచ్చు కదా అని హరీశ్‌రావు అంటున్నారు. కేసీఆర్.. తన బంధువులకు అనే పదవులు కట్టబెట్టారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment