![Congress Should Actively Participate In Flood Relief Work: Bhatti Vikramarka - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/16/BHATTI-VIKRAMARKA.jpg.webp?itok=c3fklwLT)
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న బాధిత ప్రజానీకానికి కాంగ్రెస్ శ్రేణులు ఆపన్నహస్తం అందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శుక్రవారం పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, నాయకులు పాల్గొనాలని, బాధితులకు నిరంతరం అండగా ఉండాలని ఒక ప్రకటనలో సూచించారు. వరద బాధితులకు ఆహారం, పాలు, మంచినీరు, మందులు, నిత్యావసరాలు, బట్టలు మొదలైనవి అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు రావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment