
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా మూడోసారి కోలేటి దామోదర్ గుప్తాను నియమిస్తూ సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ప్రాంతానికి చెందిన కోలేటి దామోదర్ గుప్తాను సీఎం కేసీఆర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. వరుసగా మూడుసార్లు తనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు దామోదర్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment