
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హోం డైరెక్టర్ తుమ్మల రంగారావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు విచారణను 3 రోజులు నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సీబీఐ కేసును తొలగించినా సీబీఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ.. తనను నిందితునిగా చేర్చడా న్ని సవాల్ చేస్తూ రంగారావు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీల త శుక్రవారం విచారించారు. ఆయన అప్రూవర్‌గా మారి సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూ లం ఇచ్చారు. దీంతో ఆయన్ను సీబీఐ కేసులో నిందితుల జాబితా నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment