ప్రతీకాత్మక చిత్రం
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలోని చర్ల మండలంలో ఎన్‌కౌంటర్ జరిగింది. కుర్నపల్లి, బోదనెల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందారని ఎస్పీ సునిల్ దత్ తెలిపారు. వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల అనంతరం గాలించగా ఒక మగ మావోయిస్ట్ మృతి చెందారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఘటనా స్థలం నుంచి కిట్ బ్యాగులు, 303 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
అమర వీరుల వారోత్సవాలు
ఈ నెల 3వ తేదీతో మావోయిస్టు అమర వీరుల వారోత్సవాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కుర్నపల్లి అటవీ ప్రాంతంలో కొందరు మావోయిస్టులు మీటింగ్ పెట్టారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. కూంబింగ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇక చర్ల అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment