సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న ఓ స్నేహితుడు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో తన మిత్రుడిని అమెరికాకు రప్పించేందుకు యత్నించగా విఫలమై.. కటకటాలపాలయ్యాడు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన పులిపాటి మణికంఠ బీటెక్ ఫెయిలయ్యాడు. ఉద్యోగ వెతుకులాటలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడు జనార్దన్ సూచన మేరకు మేఘాలయ – షిల్లాంగ్‌లోని విల్లియం కార్వే యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ సరి్టఫికెట్ పొందాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో జనార్దన్ సూచన మేరకు నకిలీ విద్యార్హత పత్రాల తయారీదారు నరే‹Ùను కలిశాడు. అతడిని సంప్రదించి రూ.1.6 లక్షలు చెల్లించి విల్లీయం కార్వే యూనివర్సీటీకి చెందిన నకిలీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం మణికంఠను అరెస్టు చేశారు. నరేష్, జనార్దన్‌లు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి బీఎస్సీ సరి్టఫికెట్‌తో పాటు మూడు మార్క్స్ మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ , మైగ్రేషన్ సర్టిఫికెట్, సీఎంఎం సర్టిఫికెట్ , టీసీ, రెండు ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment