
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లోని పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాల పల్లి, మంచిర్యాల జిల్లాల్లో బుధ వారం అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరా బాద్ వాతావరణ కేంద్రం హెచ్చ రికలు జారీ చేసింది.
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. బుధ, గురువారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా రాగల మూడురోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను ‘అసని‘ పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మంగళవారం ఉదయం 8.30 గంటలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరం లో కేంద్రీకృతమై ఉంది.
ఈ తీవ్ర తుపాను వాయవ్య దిశగా పయ నించి అదేరోజు రాత్రికి పశ్చిమ మధ్యబంగాళా ఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అది దిశ మార్చు కుని ఉత్తర ఈశాన్యం వైపు కదిలి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలోని వాయవ్య బంగాళా ఖాతం లోకి చేరుకునే అవకాశం ఉంది. అది క్రమంగా బలహీన పడి 24 గంటల్లోపు తుపానుగా మారే అవకాశం ఉంది. కాగా, మంగళవారం పలుచోట్ల భానుడు భగభగమన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment