
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి 4.5 కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్య కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా పశ్చిమ,మధ్య బంగాళాఖాతంలో కూడా మరో ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఉత్తర జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్‌కు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. ఆదిలా బాద్, ఆసిఫాబాద్, మంచిర్యా ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములు గు, కొత్తగూడెం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6.5 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా గార్లలో 7.35 సెం.మీ., మెదక్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ప్రాంతంలో 6.15 సెం.మీ., మెదక్ జిల్లా రాజ్‌పల్లిలో 6.05 సెం.మీ., ఖమ్మం జిల్లా కారెపల్లిలో 5.78 సెం.మీ., సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 5.58 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 7.35 సెం.మీ., మెదక్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ప్రాంతంలో 6.15 సెం.మీ., మెదక్ జిల్లా రాజ్‌పల్లిలో 6.05 సెం.మీ., ఖమ్మం జిల్లా కారెపల్లిలో 5.78 సెం.మీ., సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 5.58 సెం.మీ. వర్షపాతం నమోదైంది.