సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాల నుంచి ప్రజలు గ్రామాల బాట పట్టారు. సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టోల్‌బూత్‌ల మధ్య ట్రాఫిక్ క్లియర్ కోసం టోల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్బంగా జాతీయ రహదారి -65పై హైదరాబాద్-విజయవాడ వైపు వాహనాల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్‌లను టోల్ సిబ్బంది టోల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. దీంతో, ట్రాఫిక్ కొంత మేరకు తగ్గింది.
ఇక, సంక్రాంతి సందర్బంగా విజయవాడ బస్టాండ్‌కు ప్రయాణీకుల రద్దీ పెరిగింది. బస్టాండ్‌లో ప్లాట్‌ఫ్లామ్‌లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ప్రయాణీకులు చేరుకుంటున్నారు. కాగా, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment