సాక్షి,తెలంగాణ భవన్ : అహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..ఢీల్లి నుండి టూరిస్టులను తీసుకువచ్చి హామీలు ఇచ్చారు. బాండ్ పేపర్లతో అఫిడవిట్లు ఇచ్చి హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి గ్యారెంటీ కార్డులు పంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి జనవరి 30 వ తేదీతో 420 రోజులు అవుతుంది
జనవరి 30వ తేదీన బిఆర్ఎస్ ఆధ్వర్యంలోగాంధీని స్మరిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు కోరుతూ గాంధీకి వినతి పత్రాలు సమర్పిస్తాం. రేవంత్ రెడ్డి మంది పెళ్లిళ్లకు వెళ్లి ఫోజులు కొడుతున్నారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర మంత్రసాని పాత్ర.
రూ.40 వేల కోట్ల పెట్టుబడుల్లో ఒక్కటి రాలేదు. అందుకే ప్రజలు లక్షా 78 వేల కోట్ల పెట్టుబడులు అంటే నమ్మడం లేదు. పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తే రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తాము.రేవంత్ రెడ్డికి చేతనైతే రైతు భరోసా వేసి చూపించు.రేవంత్ రెడ్డిని చూస్తే అపరిచితుడు గుర్తు వస్తున్నాడు. దమ్ముంటే హామీలు అమలు చేసి చూపించు అని రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment