సాహిత్య అకాడమీ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సాహితీ సంపద పరిరక్షణకు పెద్దపీట వేశామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణకు చెందిన ప్రాచీన కళలు, సాహిత్యం, చరిత్రలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరిశంకర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన చరిత్ర, సాహిత్యం, కళలు, భాష, యాసలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment