
భైంసాటౌన్ (ముథోల్): పెళ్లి బృందంతో వస్తున్న బస్సు అదుపు తప్పి చేలలోకి వెళ్లిన ఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రెంజల్ నుంచి భైంసాకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పెళ్లి బృందం వస్తున్నారు. ఈ క్రమంలో భైంసా శివారులోని హరియాలి పెట్రోల్ పంపు వద్దకు రాగానే డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో డ్రైవర్ చాకచాక్యంగా బస్సును చేలల్లోకి మళ్లించాడు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment