సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారని అభియోగం నమోదైంది. కోడ్ ఉల్లంఘించి ఎల్లమ్మగుట్టలో ప్రచారం చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయగా.. నిజామాబాద్ నాలుగో టౌన్‌లో కేసు నమోదైంది.
ఈ విషయమై నోటీసు ఇచ్చేందుకు మంగళవారం నగర పోలీసులు ప్రయత్నించగా.. ఎంపీ అర్వింద్ అందుబాటులో లేరు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగర పర్యటనలో భాగంగా బస్వా గార్డెన్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన ఉన్నారనే సమాచారం మేరకు నాలుగో టౌన్ పోలీసులు అక్కడికి వెళ్లారు. నోటీసు విషయంపై ఎంపీతో చర్చించారు.
నోటీసు తీసుకోవాలని కోరగా.. ఎంపీ అరవింద్ నిరాకరించారు. ఇన్నేళ్ల తర్వాత నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు చేసేది లేక ఉన్నతాధికారుల సూచనతో వెనుదిరిగారు. కొద్దిరోజుల్లోనే ఈ నోటీసును ఆయన ఇంటి అడ్రస్‌కు పోస్టు ద్వారా లేదంటే అధికారిక మెయిల్ ఐడీకి పంపనున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment