సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన జాతీయ విద్యావిధానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ఫోన్లో చర్చించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గవర్నర్‌కు శుక్రవారం ఫోన్ చేశారు. ‘జాతీయ విద్యావిధానం–2020’ అంశంపై త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబోయే సమావేశం గురించి వారిద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సమస్య గురించి కూడా రాష్ట్రపతి కోవింద్ కోవింద్ గవర్నర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ‘జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వెబ్‌నార్ నిర్వహించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment