భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వద్ద తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరదనీరు
సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో గోదావరి దాని ఉప నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దీనితో ప్రాజెక్టులన్నీ నిండటంతో.. గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్కులకుపైన వరద వస్తోంది. దీనితో 33 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఎల్లంపల్లికి ఏకంగా ఐదున్నర లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 40గేట్లను ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఈ వరదతోపాటు ప్రాణహిత ప్రవాహం కూడా తోడు కావడంతో కాళేశ్వరం బ్యారేజీలకు ఏడు లక్షలకుపైగా వరద కొనసాగుతోంది. 11.50 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది.
► భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 22 గేట్లు ఎత్తి 54,835 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, పోచారం, ఏడుపాయల వనదుర్గ, ఘనపూర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment