
సాక్షి, హైదరాబాద్ : వరదల్లో చిక్కుకున్న వృద్ధుల ప్రాణాలు కాపాడటానికి పోలీసులు తెగువ చూపించారు. ప్రాణాలకు తెగించి మరీ వారికి సహాయం చేశారు. శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివేకానంద నగర్‌లోకి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఓ ఇద్దరు వృద్ధులు వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని తమ ఇంట్లో చిక్కుకుపోయారు. ఎటూ వెళ్లలేక, ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ గడిపారు. ( హైదరాబాద్ వరదలు: వైరల్ వీడియోలు )
ఈ విషయం తెలుసుకున్న సరూర్ నగర్ పోలీసులు వారిని రక్షించటానికి రంగంలోకి దిగారు. ఎస్‌ఐ రవికుమార్ జేసీబీ సహాయంతో ఇంటి పైకి ఎక్కి వాళ్లిద్దర్ని కిందకు తీసుకువచ్చాడు. అనంతరం అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాడు. వృద్ధలను కాపాడటంలో చొరవ చూపిన ఇన్‌స్పెక్టర్ సీతారాం, ఎస్‌ఐ రవి కుమార్‌లను జనం కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment