
సాక్షి, హైదరాబాద్: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లను మార్చడానికి ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్‌గా మార్పు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. 30 రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలను సంబంధిత కలెక్టర్లకు లిఖిత పూర్వకంగా అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment