‘ఆర్‌ఎంసీ’ నివేదికపై రాష్ట్రం అభ్యంతరం.. కృష్ణా బోర్డుకు లేఖ | Telangana Govt Objected To RMC Report | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఎంసీ’ నివేదికపై రాష్ట్రం అభ్యంతరం.. కృష్ణా బోర్డుకు లేఖ

Published Wed, Aug 31 2022 2:35 AM | Last Updated on Wed, Aug 31 2022 10:07 AM

Telangana Govt Objected To RMC Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్‌ఎంసీ) ముసాయిదా నివేదికలో తమ ప్రతిపాదనలేవీ చేర్చకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదనలను మాత్రమే నివేదికలో చేర్చడంపై తప్పుబట్టింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ మంగళవారం కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్‌ఎంసీ కన్వీనర్‌కు లేఖ రాశారు.

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రాల విద్యుత్‌ను తెలంగాణ, ఏపీ మధ్య 76:24 నిష్పత్తిలో పంపకాలు జరపాలని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు నాగార్జునసాగర్‌ నుంచి నీళ్లు విడు దల చేయరాదని, శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీళ్లను ఏపీ తరలించరాదని.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో బట్వాడా చేయాలన్న నిబంధనలను రూల్‌కర్వ్‌లో పొందుపర్చాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆర్‌ఎంసీ సమావేశంలో తెలంగాణ చేసిన ఈ ప్రతిపాదనలను ముసాయిదా నివేదికలో పొందుపర్చాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement