హైడ్రా దూకుడుకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌! | Telangana HC Stay On Hydra Demolitions Near Durgam Cheruvu, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

హైడ్రా దూకుడుకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌!

Published Mon, Sep 23 2024 1:41 PM | Last Updated on Mon, Sep 23 2024 4:00 PM

Telangana HC Stay On HYDRA Durgam Cheruvu Demolition

హైదరాబాద్‌, సాక్షి:  హైడ్రా దూకుడుకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. దుర్గం చెరువు కూల్చివేతలపై సోమవారం స్టే  ఆదేశాలు జారీ చేసింది.

ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్‌  ప్రొటెక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు..

కూల్చివేతలు ఆపేయాలని స్టే ఆర్డర్స్‌ జారీ చేస్తూనే.. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని  ఆదేశించింది. ఆ  అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుండి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట లభించినట్లయ్యింది.

కూల్చివేతలు ఆపండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement