సాక్షి, హైదరాబాద్: పలు కారణాలతో ఒక విద్యార్థి తనకు ఇష్టమైన కళాశాలలో చేరలేకపోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో కాలేజీలో చేరినా... తనకిష్టమైన కాలేజీలో చేరలేదన్న అసంతృప్తి ఆ విద్యార్థిని వెన్నాడుతుంటుంది. అందుకే అటువంటి విద్యార్థుల కోసం ఉన్నత విద్యామండలి క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానంలో తొలుత డిగ్రీ స్థాయిలో ఒక కాలేజీలో చేరి మరో కాలేజీలో క్లాసులు వినేందుకు అవకాశం కల్పించనుంది. క్లస్టర్ పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఎక్కడైనా క్లాసులు వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ముందుగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసి, తద నంతరం పూర్తిస్థాయిలో ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ సహా పలువురు వీసీలతో కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీలను కలుపుతూ పైలట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. బోధనాసిబ్బంది, అధ్యాపకుల మార్పిడితో ఒక కాలేజీలో పనిచేస్తున్న వారు అదే క్లస్టర్‌లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లు చేయడం ఇందులో కీలకమైన అంశం.
Comments
Please login to add a commentAdd a comment