సాక్షి హైదరాబాద్: ఇంగ్లిష్ మీడియం చదువులు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 2023–24 సంవత్సరం ప్రవేశాల నోటిఫికేషన్‌ను మోడల్ స్కూల్స్ డైరెక్టర్ ఉషారాణి సోమవారం విడుదల చేశారు. 6వ తరగతితో పాటు, 7–10తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభంకానుండగా, ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 16న నిర్వహిస్తారు.
ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉండగా, 6వ తరగతిలో 19,400సీట్లతోపాటు, 7–10 తరగతుల్లో మరికొన్ని ఖాళీ సీట్లున్నాయి. విద్యార్థులు http:// telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజుగా జనరల్ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ, ఈడబ్లూŠఎస్ విద్యార్థులు రూ.125 ఫీజుగా చెల్లించాలన్నారు. ప్రవేశాలు ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు.
ప్రవేశాల షెడ్యూల్
►ఆన్‌లైన్‌లో దరఖాస్తు: 10–01–2023 నుంచి 15–02–2023
►హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 08–04–2023
►పరీక్షతేదీ: 16–04–2023
►సమయం: 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు
►7–10 తరగతుల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
►ఫలితాల ప్రకటన 15–05–2023
►పాఠశాలల వారీగా ఎంపికైనవారి జాబితా ప్రకటన 24–05–2023
►సర్టిఫికెట్ వెరిఫికేషన్ 25–5–2023 నుంచి 31–5–2023 వరకు క్లాసుల నిర్వహణ 1–6–2023
Comments
Please login to add a commentAdd a comment