సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త టైం టేబుల్‌ను పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం బుధవారం విడుదల చేసింది. వాస్తవానికి టెన్త్ పరీక్షలు మే 11 నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినందున ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు.
ఇదే సమయంలో టెన్త్ పరీక్షలు నిర్వహించడం సమస్యగా ఉంటుందని భావించారు. దీంతో టెన్త్ పరీక్షలను మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుందని ఎస్సెస్సీ పరీక్షల విభాగం తెలిపింది. అయితే, మండు వేసవిలో పరీక్షల నిర్వహణపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. మార్పు అనివార్యమని భావిస్తే ఏప్రిల్‌లో పరీక్షలు పెడితే బాగుండేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment