బీజేపీ సోషల్‌ మీడియా టీంతో మాండవీయ భేటీ | Telangana: Union Minister Mansukh Mandaviya Visit BJP Office | Sakshi
Sakshi News home page

బీజేపీ సోషల్‌ మీడియా టీంతో మాండవీయ భేటీ

Dec 18 2022 1:08 AM | Updated on Dec 18 2022 8:08 AM

Telangana: Union Minister Mansukh Mandaviya Visit BJP Office - Sakshi

కేంద్రమంత్రి మాండవీయకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న బండి సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ శనివారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా టీంతో, పార్టీ రాష్ట్ర డాక్టర్స్‌ సెల్‌ సభ్యులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు, తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి విజయావకాశాలు, తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కేంద్రమంత్రితో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. మీడియాను ఉద్దేశించి తానేమీ మాట్లాడనని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement