నూతన వధూవరులకు టీఎస్ఆ‌ర్టీసీ ఎండీ సజ్జనార్‌ సర్‌ప్రైజ్‌.. | TSRTC Present A Gift To Newlyweds For Booking TSRTC Bus | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు టీఎస్ఆ‌ర్టీసీ ఎండీ సజ్జనార్‌ సర్‌ప్రైజ్‌.. స్వయంగా పెళ్లికి వెళ్లి..

Published Fri, Nov 12 2021 2:23 PM | Last Updated on Fri, Nov 12 2021 3:28 PM

TSRTC Present A Gift To Newlyweds For Booking TSRTC Bus - Sakshi

యాదగిరి గుట్ట నుంచి కొంపల్లి వరకు రెండు బస్సులను అద్దెకు తీసుకున్నారు. దీంతో...

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులతో తమ అనుబంధాన్ని పెంపొందించుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. పెళ్లిళ్లకు బస్సులను కిరాయికి తీసుకునే వధూవరులకు ఆర్టీసీ తరఫున బహుమతులివ్వాలని ఎండీ సజ్జనార్‌ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆకుల భరత్‌, సౌమ్యలు తమ వివాహానికి యాదగిరి గుట్ట నుంచి కొంపల్లి వరకు రెండు బస్సులను అద్దెకు తీసుకున్నారు. దీంతో వివాహానికి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి స్వయంగా బహుమతులు అందజేశారు. 

తాండూరు(రంగారెడ్డి): ఓ పెళ్లిలో ఆర్టీసీ ఉద్యోగులు సర్‌ప్రైజ్‌ చేశారు. దంపతులకు సంస్థ దరపున గిఫ్ట్‌ ఇవ్వడంతో అక్కడున్న వారంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఆర్టీసీ సంస్థ పెళ్లిళ్ల కోసం బస్సులు తిప్పుతోంది. ఎలాంటి డిపాజిట్‌ లేకుండా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తాండూరుకు చెందిన ఓ కుటుంబంం పెళ్లి కోసం బస్‌ బుక్‌ చేసుకుంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు పెళ్లికి హాజరై దంపతులకు గిఫ్ట్‌ ఇచ్చారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రజలు సహాకరించాలని ఉద్యోగులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement